విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం ఎంతంటే?

విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం ఎంతంటే?

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సోమవారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.1,76,670 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 145 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 18 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారన్నారు. 20 ద్విచక్ర వాహనాలకు పూజలు నిర్వహించారని, 1982 మంది అన్న ప్రసాదం స్వీకరించారన్నారు.