సగర సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

సగర సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

SRD: సంగారెడ్డి విద్యానగర్‌లో సగర ఉప్పర సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన క్యాలెండర్‌ను సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అధితిగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ హాజరై క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఆ సంఘం జిల్లా భవన నిర్మాణానికి స్థలం కేటాయించడానికి తన కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో సగర సంగం సభ్యులు ఉన్నారు.