క్షయ వ్యాధిపై స్థానిక ప్రజలకు అవగాహన

క్షయ వ్యాధిపై స్థానిక ప్రజలకు అవగాహన

NLR: ఇందుకూరుపేట మండలం రావూరు డొంక ఎస్టీ కాలనీలో ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా ప్రజలకు క్షయ వ్యాధిపై డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ చేజర్ల సుధాకర్ రావు మంగళవారం అవగాహన కల్పించారు. టీబీ వ్యాధిని సకాలంలో గుర్తించి, మల్టీ డ్రగ్ థెరపీ మందులు వాడటం ద్వారా క్షయ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్య సిబ్బంది పాల్గొన్నారు.