మార్కాపురంలో ఘనంగా మట్టల ఆదివారం
మార్కాపురం తెలుగు బాప్టిస్ట్ చర్చి సండే స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా మట్టల ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు, యవనస్తులు, చర్చి పెద్దలు ఈత మట్టలకు పువ్వులు ధరించి పలు వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. 'హోసన్నా జయం జయం' 'రాజులకే రాజుకు జయం జయం' అంటూ ప్రత్యేక పాటలు పాడారు. అనంతరం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.