ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
MBNR: భారతరత్న డా.బీ.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా దేవరకద్ర మున్సిపాలిటీలో కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ 4 వ వార్డు కౌన్సిలర్ ఉమా రాజు మాట్లాడుతూ.. పట్టణ వాసులకు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అంబేద్కర్ స్పూర్తితో సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలన్నారు.