VIDEO: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి
ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మంత్రి స్వామి రూ. 55 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని సీఎం చంద్రబాబు సీఎం రిలీఫ్ ఫండ్ వెంటనే విడుదల చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. మేలు చేసిన ప్రభుత్వాన్ని మర్చిపోరాదని మంత్రి స్వామి అన్నారు.