VIDEO: మృత కోడితో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన బాధితుడు
MHBD: మరిపెడ మండలం మర్రితండాలో అక్రమ ఇసుక రవాణా మరో విచిత్ర ఘటనకు దారితీసింది. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ కింద పడి ఓ కోడి మృతి చెందింది. బాధితుడు భూక్య మచ్య మంగళవారం మృత కోడితో సహా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేస్తున్నాడు.