కాంగ్రెస్ పార్టీకి కేంద్రం షాక్

కాంగ్రెస్ పార్టీకి కేంద్రం షాక్

కాంగ్రెస్ పార్టీకి కేంద్రం షాక్ ఇచ్చింది. గత 48 ఏళ్లుగా ఉపయోగిస్తున్న ఢిల్లీలోని 24 అక్బర్ రోడ్‌లోని కార్యాలయాన్ని ఖాళీ చేయాలని ఆదేశించినట్లు సమాచారం. గతేడాది కాంగ్రెస్ పార్టీ తన కొత్త కార్యాలయాన్ని ఇందిరా భవన్ వద్ద ప్రారంభించింది. అయినప్పటికీ అక్బర్ రోడ్‌లో ఉన్న పాత కార్యాలయాన్ని ఖాళీ చేయకుండా కార్యకలాపాలు కొనసాగిస్తుండడంతోనే ఈ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.