గంజాయి మొక్కలు పెంచుతున్న వ్యక్తి అరెస్ట్
PDPL: గంజాయి మొక్కలు పెంచుతున్న వ్యక్తి అరెస్టు అయిన ఘటన సుల్తానాబాద్ PS పరిధిలో చోటుచేసుకుంది. సుల్తానాబాద్ (M) ఆరేపల్లి గ్రామంలోని సాయిరాం బ్రిక్స్ వద్ద ఓ వ్యక్తి గంజాయి మొక్కలు పెంచుతున్నాడనే సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అతడిని అదుపులోకి తీసుకుని 50 వేల విలువగల 5 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు.