వందేమాతరం పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
'వందేమాతరం' పాడటంపై కేంద్రం ఇచ్చింది కేవలం 'అడ్వైజరీ' మాత్రమేనని, అది తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. పాటించని వారిపై ఎలాంటి శిక్షలు లేనందున, ఈ పిటిషన్‌ను విచారించడం తొందరపాటు అవుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఒకవేళ భవిష్యత్తులో దీనిపై బలవంతం లేదా శిక్షార్హమైన చర్యలు తీసుకుంటే తాము జోక్యం చేసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేస్తూ కేసును కొట్టివేసింది.