వికారాబాద్ జిల్లాకు 'ఆరెంజ్' అలర్ట్
VKB: వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా రేపు ఉదయం 8 గంటల వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఏప్రిల్ 3 వరకు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు, గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంటూ 'ఆరెంజ్ అలర్ట్' జారీ చేసింది.