రమ్యకృష్ణతో ఈటీవీ విన్ కొత్త ప్రాజెక్ట్
ఈటీవీ విన్ ఓరిజినల్ ప్రొడక్షన్ మరో కొత్త చిత్రాన్ని ప్రారంభించింది. 'పాకశాల పంతం' అనే పేరుతో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ రోజు ఈ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టారు. రమ్యకృష్ణ, ఐశ్వర్య రాజేష్ ఇందులో ప్రధాన పాత్రల్లో నటించబోతున్నారు.