వెల్దుర్తి వద్ద రోడ్డు ప్రమాదం

వెల్దుర్తి వద్ద రోడ్డు ప్రమాదం

KRNL: వెల్దుర్తిలోని మంగపల్లె స్టేజ్ వద్ద నేషనల్ హైవేపై ఆదివారం ఉదయం లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఘటనలో డ్రైవర్ ఆంజనేయులు (35) తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని హుటాహుటిగా కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడు వనపర్తి జిల్లా పెబ్బేరులోని బూడిదపాడు వాసిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.