ఉచిత కంటి వైద్య పరీక్షలు
KMR: గాంధారి పట్టణ కేంద్రంలోని సీహెచ్‌సీలో ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఆప్తాల్మిక్ ఆఫీసర్ హరికిషన్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి సోమవారం కంటి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పలువురికి ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఆపరేషన్ అవసరమైన వారికి జిల్లా కేంద్రానికి సిఫారసు చేస్తామన్నారు.