ఉంగుటూరులో ఈ రహదారి ప్రమాదభరితం

ELR: ఉంగుటూరు పశువుల చెరువు వద్ద తహసిల్దార్ రహదారి మలుపు ప్రమాదబరితంగా ఉంది. ఒకపక్క గొయ్యి, మరో ప్రక్కన ప్రమాదబరితంగా డ్రైనేజీ ఉంది. ఏమాత్రం ద్విచక్ర వాహనదారులు ఆదమరిచినా ప్రమాదం తప్పదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గ్రామపంచాయతీ వారు స్పందించి గొయ్యిని పూడ్చి, డ్రైనేజీ పై రాప రాళ్ళను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.