రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

NRML: ముథోల్ మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో విట్టోలి గ్రామానికి చెందిన అనిల్ (30) అనే వ్యక్తి మృతి చెందాడు. భైంసా-బాసర జాతీయ రహదారిపై నిలిపి ఉంచిన లారీని అతని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.