'రైతు పోరుబాట' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
ADB: బేల మండలం సాంగిడి గ్రామంలో నిర్వహించిన 'రైతు పోరుబాట' కార్యక్రమానికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ హాజరై రైతులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలకు అతీతంగా రైతులందరూ ఐక్యంగా నిలబడలన్నారు. రైతులందరూ కలిసి రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలనీ ప్రభుత్వాన్ని కోరారు.