అటవీ మార్గంలో తిరుమల యాత్రకు అనుమతి నిరాకరణ

అటవీ మార్గంలో తిరుమల యాత్రకు అనుమతి నిరాకరణ

అన్నమయ్య: రైల్వేకోడూరు మండలం కుక్కలదొడ్డి గ్రామం నుండి అటవీ మార్గం ద్వారా తిరుమల వెళ్లే భక్తులకు జిల్లా అటవీ శాఖ అధికారులు అనుమతి నిరాకరించారు. అటవీ శాఖాధికారి R. జగన్నాథ్ సింగ్ మంగళవారం మాట్లాడుతూ.. ఈ మార్గంలో ఏనుగుల గుంపులు, ముఖ్యంగా పిల్లలతో కూడినవి అధికంగా ఉన్నాయన్నారు. ప్రజల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.