ఉత్తరాంధ్ర ద్రోహులుగా టీడీపీ నాయకులు: ధర్మాన ప్రసాదరావు

శ్రీకాకుళం: ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు అని, ఈ ప్రాంతం అభివృద్ధికి ఏనాడూ కట్టుబడి లేరని, విశాఖను రాజధానిగా చేసే విషయమై ఇక్కడి టీడీపీ నాయకులు తమ స్టాండ్ ఏంటో చెప్పగలరా అని శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈ ప్రాంత ప్రయోజనాలు పట్టని నాయకులు ఎన్నికల్లో ఓట్లేయమని ఎక్కడికి వచ్చి ఏ విధంగా అడుగుతారని మండిపడ్డారు.