వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు ప్రారంభం

వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు ప్రారంభం

JGL: కథలాపూర్ కేంద్రంలోని రైతు వేదికలో కొత్తగా ఎన్నికైన వార్డు సభ్యులకు బుధవారం శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఎంపీడీవో శంకర్ మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకమన్నారు. వార్డు సభ్యులు గ్రామ సభలకు హాజరై గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల కోసం సలహాలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడానికి వార్డు సభ్యులు కృషి చేయాలన్నారు.