VIDEO: పీవైఎల్, పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ
MNCL: భారత జాతీయోద్యమ వీరులు షాహిద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ వర్ధంతి సందర్భంగా పీవైఎల్, పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం మంచిర్యాలలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ.. భారత దేశ విముక్తి కోసం ప్రాణత్యాగం చేసిన యువ కిశోరాల పోరాటం నేటి విద్యార్థి, యువతకు స్ఫూర్తిదాయకమని తెలిపారు.