'సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ'
SDPT: తొగుట మండలానికి చెందిన 23 మందికి రూ. 9,46,500 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేశారు. రాష్ట్రంలో పేదల ప్రభుత్వం ఉందని, లక్షల మందికి రేవంత్ రెడ్డి అండగా నిలుస్తున్నారని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తదితర మండల నాయకులు పాల్గొన్నారు.