సీఎం ఫ్యామిలీ కాంట్రాక్టులపై సుప్రీం కీలక ఆదేశాలు
అరుణాచల్‌ప్రదేశ్ సీఎం పెమా ఖండు ఫ్యామిలీ కాంట్రాక్టులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కుటుంబసభ్యులకు కాంట్రాక్టు కేటాయింపులపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. తన కుటుంబానికి చెందిన కంపెనీలకు రూ.1,200 కోట్ల కాంట్రాక్టులు ఇచ్చినట్లు సీఎం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.