VIDEO: అనపర్తిలో వైభవంగా బతుకమ్మ పండుగ
E.G: దసరా నవరాత్రులు పురస్కరించుకుని తెలంగాణలో జరిపే బతుకమ్మ పండగను అనపర్తిలో ఇవాళ ఘనంగా నిర్వహించారు. అనపర్తిలోని వీరుళ్లమ్మ ఆలయం వద్ద ఉన్న ఓం శక్తి సత్సంగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు భక్తులు పాల్గొని బతుకమ్మల చుట్టూ పాటలు పాడుతూ నృత్యం చేశారు. అనంతరం బతుకమ్మలను తలపై పెట్టుకుని ఊరేగించి, ఎర్ర కాలువలో విడిచి పెట్టారు.