ముమ్మరంగా వృక్షాల తొలగింపు పనులు
కృష్ణా: భారీ ఈదురుగాలులు, వర్షాల ప్రభావంతో చల్లపల్లి – విజయవాడ రహదారిపై భారీ వృక్షాలు రహదారిపై పడిపోయి వాహన రాకపోకలకు బుధవారం అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంలో చల్లపల్లి సీఐ కె. ఈశ్వరరావు, ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం ఇతర పోలీసు సిబ్బందితో కలిసి తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టారు.