రోడ్డుపై ధాన్యం ఆరబెట్టవద్దు: SI
WGL: రవాణా మార్గాల్లో ప్రమాదాలు పెరగకుండా రోడ్లపై ధాన్యం ఆరబెట్టే పద్ధతిని రైతులు వెంటనే మానుకోవాలని WGL జిల్లా పోలీసులు హెచ్చరించారు. ఇవాళ సంగెం SI వంశీకృష్ణ మాట్లాడుతూ.. రోడ్డు మీద ధాన్యం వల్ల వాహనదారులకు తీవ్ర ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. పంటను మైదానాల్లో లేదా ప్రత్యేక స్థలాల్లో ఆరబెట్టాలని, ప్రజల భద్రత కోసం అందరూ సహకరించాలని కోరారు.