అన్నవరం దేవస్థానం.. 2025ంతా వివాదాలే!

అన్నవరం దేవస్థానం.. 2025ంతా వివాదాలే!

KKD: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానానికి 2025 కలిసిరాలేదు. ఏడాది పొడవునా వివాదాలతోనే వార్తల్లో నిలిచింది. ఆదాయం, అభివృద్ధి పనుల్లో పురోగతి లేకపోగా రాజకీయ జోక్యం పెరిగిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. 2024 డిసెంబర్ 14న బాధ్యతలు చేపట్టిన ఈఓ సుబ్బారావుపై పాలనా అనుభవలేమి, కుటుంబ జోక్యం, ప్రొటోకాల్ ఉల్లంఘనల ఆరోపణలు వచ్చాయి.