పశువుల అక్రమ రవాణా పట్టివేత

పశువుల అక్రమ రవాణా పట్టివేత

SKLM : ఎల్.ఎన్. పేట మండలంలోని  అలికాం-బత్తిలి ప్రధాన రహదారిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో అక్రమంగా తరలిస్తున్న పశువులను వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ వాహనంలో నాలుగు ఎద్దులు, ఒక దూడను స్వాధీనం చేసుకుని సరుబుజ్జిలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.కేసు నమోదు చేసినట్లు సరుబుజ్జిలి ఎస్సై హైమావతి తెలిపారు.