జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు
వనపర్తి జిల్లా వ్యాప్తంగా ఈరోజు నుంచి ఈ నెల 31వ తేదీ వరకు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు నిర్వహించరాదని సూచించారు. అనుమతి లేకుండా కార్యక్రమాలు చేపట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.