'MGMలో సౌకర్యాలు మెరుగుపరచండి'

'MGMలో సౌకర్యాలు మెరుగుపరచండి'

WGL: ఉమ్మడి జిల్లాలో పేదలకు పెద్ద దిక్కుగా నిలిచిన MGM ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగుపరచాలని ప్రజావేదిక రాష్ట్ర ఛైర్మన్ తిరునహరి శేషు డిమాండ్ చేశారు. ఇవాళ MGM సూపరింటెండెంట్‌కు శేషు స్థానిక నేతలతో కలిసి వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ సత్య శారద, ప్రజాప్రతినిధులు దృష్టి సారించి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, డాక్టర్లు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని కోరారు.