వరంగల్‌లో భారీగా హాష్ ఆయిల్ పట్టివేత
WGL: ఆంధ్రప్రదేశ్ లోని తుని నుంచి ముంబైకి తరలిస్తున్న రూ.2.5 కోట్ల విలువైన 20 కేజీల హాష్ ఆయిల్‌ను వరంగల్ రైల్వే గూడ్స్ షెడ్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా నలుగురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఒడిశా, ఏపీకి చెందిన నలుగురు గంజాయి స్మగ్లర్లు పోలీసుల అదుపులో ఉన్నారు. ప్రధాన సూత్రధారి కిలో పాండు పరారీలో ఉండగా గాలింపు చేపట్టారు.