చట్ట పరిధిలోని ఫిర్యాదులను పరిష్కరిస్తాం

చట్ట పరిధిలోని ఫిర్యాదులను పరిష్కరిస్తాం

SKLM: పలాస కాశీబుగ్గ డివిజనల్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం బాధితుల నుంచి ఎస్పీ మహేశ్వరరెడ్డి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చట్ట పరిధిలోని ఫిర్యాదులను పరిష్కరిస్తామని అర్జీదారులకు భరోసా ఇచ్చారు. అనంతరం ఫిర్యాదులను సంబంధిత అధికారులకు ఎండార్స్ చేసి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.