నీటి పారుదల, నీటి వనరుల గణనపై అవగాహన
KMR: మద్నూర్ రైతు వేదికలో తహసీల్దార్ ముజీబ్ అధ్యక్షతన గురువారం సూక్ష్మ నీటిపారుదల, నీటి వనరుల గణన నమోదుపై గణనదారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నీటి కుంటలు, చెరువులు, సూక్ష్మ నీటిపారుదల వనరులను మొబైల్ యాప్ ద్వారా లెక్కించి నమోదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్యుమరేటర్లు, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.