వేములవలస మార్కెట్ రూ.1.27 కోట్లకు వేలం

విశాఖ: ఆనందపురం మండలం వేములవలస డైలీ మార్కెట్‌ను రూ.కోటీ 27 లక్షల 998కి ఎన్ని శంకర్రావు వేలంలో సొంతం చేసుకున్నారు. జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యాన గ్రామ పంచాయతీ విస్తరణ అధికారి రామారావు అధ్యక్షతన వేములవలస వేలంపాట ఆదివారం నిర్వహించారు.