CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
VZM: అనారోగ్యంతో బాధపడే వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఒక ఆపన్న హస్తమని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన అన్నారు. గురువారం బొబ్బిలి నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న 33 మంది లబ్ధిదారులకు రూ. 20,10,954/- ల సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే కోటలో అందజేశారు. సీఎం చంద్రబాబు ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకై పేద ప్రజలను ఆదుకుంటున్నారని తెలిపారు.