నస్రుల్లాబాదులో రైతులతో మాట్లాడిన సబ్ కలెక్టర్

నస్రుల్లాబాదులో రైతులతో మాట్లాడిన సబ్ కలెక్టర్

నిజామాబాద్: రోడ్డు వెడల్పులో భాగంగా భూములు పోతున్న రైతులతో సబ్ కలెక్టర్ కిరణ్మయి శనివారం మాట్లాడారు. నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని తహసీల్దార్ ఆఫీసులో సబ్ కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ.. రోడ్డు వెడల్పులలో ఎంత మంది రైతులవి ఎంత శాతం భూములు కోల్పోతున్నారనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇందుకు రైతులు సహకరించాలన్నారు. తమకు తగిన పరిహారం అందించాలని రైతులు కోరారు.