VIDEO: పెండింగ్ చలానాలపై స్పెషల్ డ్రైవ్
AKP: నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనదారులు భారీగా చలానాలు కట్టకపోవడంతో గురువారం పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. టౌన్ ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద గురువారం ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి వాహనం రికార్డులను క్షుణంగా తనిఖీ చేశారు. పెండింగ్‌లో ఉన్న చలానాలను వసూలు చేస్తున్నమన్నారు.