చిత్తూరులో పెంపుడు కుక్కకు సమాధి

చిత్తూరులో పెంపుడు కుక్కకు సమాధి

CTR: తమ కుటుంబంలో ఒకరిలా గారాబంగా పెంచుకున్నారు. వారితో పాటే అన్నం పెట్టారు. స్నానం చేయించారు. వారి మధ్యే నిద్ర కూడా పోనిచ్చేవారు. చివరికి తమని వదిలి వెళ్లిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోయారు. ఇంతకీ ఎవరిని అనుకుంటున్నారా! చిత్తూరు పట్టణంలోని గ్రీమ్స్ పేటలో ఓ పెంపుడు కుక్క స్టోరీ ఇది. అది చనిపోవడంతో దానిని మర్చిపోలేక యజమాని కుక్కకి సమాధి కట్టించాడు.