మరి కాసేపట్లో పవర్ కట్

కృష్ణా: పోరంకి సబ్‌స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. సాలిపేట ఫీడర్‌లో నిర్వహించే మరమ్మతుల కారణంగా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో సాలిపేట, ఏవీఎం గార్డెన్స్, బందర్ రోడ్, సిద్ధిక్ నగర్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ కోత ఉండనుంది.