సబ్ జైల్‌లో తనిఖీలు నిర్వహించిన జూనియర్ సివిల్ జడ్జ్

NTR: నందిగామ మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ షేక్ రియాజ్ నందిగామ సబ్ జైలులో తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత ఖైదీలు సత్ప్రవర్తనతో కలిగి ఉండాలన్నారు. అసంఘటిత కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు.