తడి పొడి చెత్త వేరుచేసే విధానం
AKP: ఎలమంచిలి మున్సిపల్ కార్యాలయంలో విద్యార్థులకు తడి, పొడి చెత్త వేరు చేసే విధానంపై సోమవారం అవగాహన కల్పించారు. స్వచ్ఛ సర్వేక్షన్-2026లో భాగంగా కొక్కిరాపల్లి బాలికల వసతి గృహం విద్యార్థులకు ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్ధాలను వివరించినట్లు మున్సిపల్ సానిటరీ సూపర్‌వైజర్ శ్రీనివాసరావు తెలిపారు. విద్యార్థులు పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.