ప్రతిపక్షాలను అణచివేయడం మోదీ వల్ల కాదు: కైలాస్‌ నేత

ప్రతిపక్షాలను అణచివేయడం మోదీ వల్ల కాదు: కైలాస్‌ నేత

NLG: మోదీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ వంటి సంస్థలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలను అణచివేయాలని చూస్తోందని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు పున్నా కైలాస్‌ నేత మండిపడ్డారు. గురువారం నల్గొండలోని బీజేపీ కార్యాలయ ముట్టడి సందర్భంగా ఆయన మాట్లాడారు. పరిపాలన చేతగాక, ప్రతిపక్షాలను ఎదుర్కొనే ధైర్యం లేకనే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు.