బస్సు కంటే బైక్ బెటర్.. RTC ఛార్జీలపై ఫిర్యాదులు
HYD: ఆర్టీసీ ఛార్జీలపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వందల సంఖ్యలో ట్వీట్లు చేస్తున్నారు. ఓ ప్రయాణికుడు RTC బస్సులో పరేడ్ గ్రౌండ్ నుంచి సికింద్రాబాద్ వెళ్లగా రూ. 25 ఛార్జీ వసూలు చేశారని, దీన్నిబట్టి చూస్తే బస్ కంటే, బండి పై వెళ్లడం మేలని తన అభిప్రాయం తెలిపారు. కాగా, సిటీలో ఇటీవలే ఆర్టీసీ ఛార్జీలు పెంచిన సంగతి తెలిసిందే.