VIDEO: కానిస్టేబుల్ మృతదేహంతో కుటుంబ సభ్యుల నిరసన
WGL: నగరంలోని ఎంజీఎం సర్కిల్ వద్ద కానిస్టేబుల్ సంగీత మృతదేహంతో కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు. పోలీస్ శాఖలోనే మహిళా కానిస్టేబుళ్లకు రక్షణ కరువైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనల నేపథ్యంలో శాంతి భద్రతల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని, పోలీస్ వ్యవస్థలో మహిళల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ విమర్శించారు.