'పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలి'
BHNG: ఆలేరు మండలం కొలనుపాకలో అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) డిమాండ్ చేసింది. సోమవారం CPI జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్ గుడిసెల్లో నివసిస్తున్న లబ్ధిదారులను ప్రత్యక్షంగా సందర్శించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమిలేని నిరుపేదలకు ఇంటి స్థలాల పట్టాలు ఇవ్వాలని కోరారు.