ఎలక్షన్ కోడ్ అమలుపై అధికారుల నిర్లక్ష్యం
NRPT: ఎన్నికలు వస్తున్నాయి అంటే ప్రతి గ్రామంలో ఎలక్షన్ కోడ్ అమలు చేస్తారు. అయితే సర్వ మండలలోని అంబేద్కర్ కూడలిలో వివిధ పార్టీలకు చెందిన గుర్తులకు ముసుగు ధరించారు. కానీ కొన్ని పార్టీ గుర్తులకు ముసుగు ధరించడం లేదని ప్రజలు వాపోతున్నారు. అదేవిధంగా ఎలక్షన్ కోడ్ అమలై కొన్ని గంటలు గడుస్తున్నా కూడా అధికారులు ఎలక్షన్ కోడ్‌ను నిర్లక్ష్యంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.