40 గ్రామాలకు రాకపోకలు బంద్

AP: అల్లూరి జిల్లా మారేడుపల్లి మండలం బొడ్లంకలో పెళ్లిరేవువాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో 40 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మారేడుమిల్లి నుంచి గుర్తేడు, పాతకోటకు పూర్తిగా రాకపోకలు బంద్ అయ్యాయి. కాగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే.