కీర్తి సురేశ్‌కు అరుదైన గౌరవం

కీర్తి సురేశ్‌కు అరుదైన గౌరవం

ప్రముఖ నటి కీర్తి సురేశ్‌కు అరుదైన గౌరవం లభించింది. ఐక్యరాజ్యసమితికి చెందిన యూనిసెఫ్(UNICEF) ఇండియా విభాగానికి ఆమె సెలబ్రిటీ అడ్వకేట్‌గా నియమితులయ్యారు. ఈ నియామకంపై యూనిసెఫ్ ఇండియా ప్రతినిధి సింథియా మెక్‌కాఫ్రీ హర్షం వ్యక్తం చేశారు. పిల్లల హక్కులు, వారి శ్రేయస్సు కోసం పోరాడటానికి కీర్తి.. బలమైన వేదిక అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.