"యూరియా ఎక్కువ వాడకండి"

NLR: రైతులు ఇష్టానుసారంగా ఎక్కువ యూరియా వాడరాదని జిల్లా వనరుల కేంద్రం ఏడీఏ మారుతీదేవి సూచించారు. ఉదయగిరి మండలం శకునాలపల్లి రైతు సేవా కేంద్రంలో ఒక్కరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. రైతులు వ్యవసాయాధికారుల సూచనల మేరకే ఎరువులు, పురుగు మందులు వినియోగించాలన్నారు. మండల వ్యవసాయాధికారి విజయభాస్కర్, వీఏఏ వెంకటపతి పాల్గొన్నారు.