ఏడుపాయల వద్ద మంజీరా పరవళ్లు..

MDK: ఏడుపాయల వనదుర్గ మాత దేవాలయం వద్ద మంజీరా నది పరవళ్లు తొక్కుతుంది. గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో మంజీరా నదిలోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. దేవస్థానం వద్ద గణపురం ఆయకట్ట పైనుంచి మంజీరా నీరు కిందికి వెళ్తు దుర్గమ్మ దేవాలయం వద్ద జల సవ్వడి నెలకొంది. ఆదివారం అమ్మవారి దేవాలయానికి వచ్చిన భక్తులు నదిలో స్నానాలు ఆచరిస్తున్నారు.